TRINETHRAM NEWS

జగన్మోహన్ రెడ్డిని వారి భార్య పిల్లలకు అప్పగించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మండలoలోని మదన్ పల్లి గ్రామానికి చెందిన బిల్లపాటి రమాదేవి భర్త జగన్మోహన్ రెడ్డిని 26రోజుల క్రితం కిడ్నాప్ చేసిన గ్రామస్తులు మరియు వాళ్ళ చుట్టాలపై చట్టపరమైన చర్యలు తీసుకొని, జగన్మోహన్ రెడ్డిని రమదేవికి,పిల్లలకు అప్పగించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా కార్యదర్శి అనసూయ, రేణుక లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేనిచో ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు* వికారాబాద్ మండల పరిధిలోని మదన్ పల్లి గ్రామానికి చెందిన బిల్లపాటి రమాదేవి 11ఏండ్ల క్రితం పెండ్లి ఐనది ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.

భర్త బిల్లపాటి జగన్మోహన్ రెడ్డిని 26రోజుల క్రితం చేవెళ్ల లోని దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన సింపుల సత్యనారాయణరెడ్డి, రిత్విక్ రెడ్డి, బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి, సబితా, ఆడపడుచు లు మరియు కొంత మంది గుండాలు రమాదేవి భర్త భూమి 6ఎకరాలు కాజేయ్యాలని , మతి స్థిమితంసరిగా లేని రమాదేవి భర్త జగన్మోహన్ రెడ్డిని కిడ్నాప్ చేసిన వ్యక్తుల పైన 26రోజుల క్రితం పిర్యాదు చేసిన వికారాబాద్ పోలీసులు నిందితుల పై కేసులు నమోదు చెయ్యకుండా, పైగా మహిళను ఇబ్బందులకు గురి చేస్తు రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటారు.

మహిళలకు రక్షణ కల్పించలేని అధికారులు వికారాబాద్ లో ఉన్నారు. పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి నిందితులపై కట్టిన మైన చర్యలు తీసుకోనీ, రమాదేవికి పిల్లల కు జగన్మోహన్ రెడ్డిని అపగించాలని ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కు కోరుతున్నాము. లేని ఎడల డీఎస్పీ, SP కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము. మహిళకు న్యాయం జరిగేవరకు మేము అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు రమాదేవి కుటుంబసభ్యులు పిల్లలు అమ్మమ్మ తమ్ముడు మహిళా సంఘం ఐద్వా జిల్లా నాయకురాలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagan Mohan Reddy