TRINETHRAM NEWS

భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చింది మహాత్మా గాంధీ అయితే తెలంగాణకు స్వాతంత్రాన్ని తెచ్చిన తెలంగాణ జాతిపిత కేసిఆర్ : శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్….

Trinethram News : Medchal : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఈనెల 29న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ నిర్వహణపై గండి మైసమ్మలోని బిఆర్ఎస్ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు అధ్యక్షతన మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మా రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కెపి.వివేకానంద్, మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దీక్షా దివాస్ కార్యక్రమ జిల్లా ఇంచార్జ్ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ గత పాలకుల పాలనలో అడుగడుగునా వివక్షకు గురైన తెలంగాణ ప్రాంత అభివృద్ధి కేవలం స్వరాష్ట్ర సాధనతోనే సాధ్యమని నమ్మి “తెలంగాణ వచ్చుడో… కెసిఆర్ సచ్చుడో” అనే ఉద్యమ పంథాలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసిన దార్శనికుడు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా అందరిని ఏకం చేస్తూ కెసిఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు నవంబర్ 29, 2009 తేదిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం దీక్షా దివాస్ పేరుతో నాటి ఉద్యమ తీరును నెమరువేసుకోవడం జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి అభివృద్ధి పరిచిన తెలంగాణ అభివృద్ధి ప్రదాత కెసిఆర్ అని, గత పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి ప్రభుత్వ మార్పుతో నాడు అభివృద్ధి – సంక్షేమం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలను అవస్థల పాలు చేస్తున్న కాంగ్రెస్, బిజెపి లకు ఎండగట్టేందుకు తెలంగాణ సమాజాన్ని మరోమారు ఐక్యం చేస్తూ రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వంతో కొట్లాడే బాధ్యత మనందరిపై ఉంది. దీక్షా దివాస్ రోజును స్మరించుకుంటూ దీక్షా దివాస్ రోజున ప్రతి కార్యకర్త తమ ఇంటి ముందు కెసిఆర్ ఫోటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు.

కావున ఈనెల 29వ తేదీన ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే దీక్షా దివాస్ కార్యక్రమానికి ప్రతి నాయకుడు, కార్యకర్త స్వచ్ఛందంగా తరలివచ్చి దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

అనంతరం ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహా నాయకులు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వ మార్పుతో కేవలం 11 నెలల వ్యవధిలో అభివృద్ధిలో దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిపి సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలపై సమర శంఖం పూరించేందుకు దీక్షా దివాస్ కార్యక్రమంతోనే మరో మారు అంకురార్పరణ జరగాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన కార్పొరేటర్లు, మేయర్ లు, మున్సిపల్ చైర్మన్ లు, పాక్స్ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App