TRINETHRAM NEWS

మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

Trinethram News : రేపు సాయంత్రం 4.08 గంటలకి పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం

శ్రీహరికోట షార్ నుంచి రాకెట్‌ని ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు

ఇవాళ మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రారంభం కానున్న కౌంట్ డౌన్

ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని పంపనున్న ఇస్రో

సూర్యుడిపై పరిశోధనలకి ఉపయోగపడనున్న ప్రోబా-3 ఉపగ్రహం

పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం- 2.38 నిమిషాలకు మొదలైన కౌంట్ డౌన్

రేపు సాయంత్రం 4.08 గంటలకి పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం

ప్రోబా-3 ఉపగ్రహంలో 310 కేజీల బరువైన కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కేజీల ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్‌లను నింగిలోకి పంపనున్న శాస్త్రవేత్తలు

ఈ ప్రయోగం ద్వారా సూర్య కిరణాలని ఎప్పటికప్పుడు అధ్యయనం చేయనున్న ఉపగ్రహం

కృత్రిమంగా సూర్య గ్రహణాన్ని సృష్టించడం వంటి ప్రయోగాలకు కీలకంగా మారనున్న ఉపగ్రహం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App