Trinethram News : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. మరింత మెరుగైన వాతావరణ అంచనాల కోసం జీఎస్ఎల్వీ-ఎఫ్14/ఇన్సాట్-డీఎస్ మిషన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఫిబ్రవరి 17, 2024న సాయంత్రం 5:30 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్14ను ప్రయోగించనుంది. జీఎస్ఎల్వీ ఇన్సాట్-3డీఎస్ వాతావరణ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రయోగానికి సంబంధించిన వివరాలను ‘ఎక్స్’ వేదికగా ఇస్రో షేర్ చేసింది. జీఎస్ఎల్వీ మూడు దశల లాంచ్ వెహికిల్ అని, ఇది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుందని ఇస్రో వెల్లడించింది.
మరో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఇస్రో
Related Posts
Murder Case : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు
TRINETHRAM NEWS కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న కోర్టు..!! Trinethram News : కోల్‌కతా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్‌పై (Kolkata Doctor Case) హత్యాచార…
గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హామీలు
TRINETHRAM NEWS గర్భిణీలకు రూ.21,000, మహిళలకు నెలకు రూ.2,500.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హామీలు Trinethram News : న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల (Delhi election) కోసం బీజేపీ హామీలు గుప్పించింది. గర్భిణీలకు…