
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
చంచల్ గూడ జైలులో మహిళా జర్నలిస్టులు రేవతి తన్వి యాదవులకు పరామర్శ
హాజరైన మాజీ మంత్రులు సబిత, సునీత రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, దాసోజు శ్రవణ్
Trinethram News : ఆడబిడ్డలపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంచల్ గూడ జైలుకు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సోషల్ మీడియాలో సీఎంను అసభ్యంగా వీడియోలు పెట్టారని ఆరోపిస్తూ మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్ లపై కేసులు పెట్టిన నేపద్యంలో జైలులో కేటీఆర్ వారిని పరామర్శించారు. కేటీఆర్ తోపాటు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి, దాసోజు శ్రవణ్ ఉన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని, వ్యతిరేకతను చెప్తే జర్నలిస్టులను అక్రమ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి ప్రజలు డిజిటల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని బయట పెడితే రేవంత్ రెడ్డి బాషలోనే అయన స్ధానాన్ని గుర్తు చేస్తే ఈరోజు జర్నలిస్టులను జైలులో పెడితే ఎంత వరుకు న్యాయం అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గౌతమ్ గౌడ్, ఆకుల శ్రీనివాస్ రెడ్డి, శంకర్ గౌడ్, రంజిత్ రెడ్డి, రాజ్ కుమార్ నాయక్, సరిత యాదవ్, విజయారెడ్డి, రేవతి, తన్వీ యాదవ్, శివారెడ్డి ఇలా ఇంత మంది జర్నలిస్టులను అక్రమ అరెస్ట్ చేశారు అని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలంతా అదేదో సంక్షేమ రాజ్యం అని భ్రమపడ్డారని కెసిఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూందేమో అన్న అపోహలో గెలిపించారని విమర్శించారు.
కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిని చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వచ్చేలా ఉందని అన్నారు. 420 హామీలను ఇచ్చి తమని మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ప్రజలు తమ ఆకృషాన్ని వెల్లబుచుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి అర్థం కావడానికి ఆయన మాట్లాడే బజారు భాషలోనే మాట్లాడితే బాగుంటుందని కొంతమంది సామాన్యులు కూడా అదే భాషను ఉపయోగిస్తున్నారని అన్నారు.
రాహుల్ గాంధీ చెప్పిన మొహబ్బత్ కి దుకాణ్ ఇదేనా అని ప్రశ్నించారు. జనం నిలదీస్తే ప్రజలు ప్రశ్నిస్తే జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతారా జర్నలిస్టులను జైలుకు పంపుతారా అని నిలదీశారు. ఒకరిద్దరు జర్నలిస్టులను కాదు పదుల సంఖ్యలో జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు దాడులతో వేధిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తున్నందుకే యూట్యూబ్ జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి అక్కసు వెళ్ళగకుతున్నారని అన్నారు. 6 గ్యారంటీ లతోపాటు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యమని పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రజలు గొంతు విప్పితే మాత్రం తట్టుకోలేకపోతున్నాడని అన్నారు. తన భార్య పిల్లలను దూషిస్తున్నారని బాధపడుతున్న రేవంత్ రెడ్డి గతంలో మా మీద అవాకులు చేవాకులు మాట్లాడిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. మా పిల్లల ప్రస్తావన తీసుకుని వచ్చినప్పుడు రేవంత్కు కుటుంబం గుర్తుకు రాలేదా..? నువ్వు మాట్లాడితే మంచిది ఇంకొకరు మాట్లాడితే మంచిది కాదా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. రేవతి యాదవ్ తన్వి యాదవ్ లకు కలిసి ధైర్యం చెప్పామని అన్నారు. వారి తరఫున న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. జైల్లో పెడతామంటే భయపడడానికి ఇక్కడ ఎవరూ లేరు మేమంతా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం జనం నుంచి వచ్చిన వాళ్ళం కేసులకి భయపడే వాళ్ళం కాదని హెచ్చరించారు. వంతపడే వాళ్లకు కూడా ఇదే జరుగుతుందని అన్నారు. రేవతి తన్వి యాదవులకు జరిగిందే రేపు మిగతా జర్నలిస్టులో కూడా జరగవచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల ఆకృషాన్ని చూపించడమే వారు చేసిన తప్ప అని నిలదీశారు. పిచ్చోడైన రేవంత్ రెడ్డి చేతిలో రాయల తెలంగాణ మారిందన్నారు. జర్నలిస్టులను జైల్లో పెడతామని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి కాలమే సమాధానం చెబుతుంది అన్నారు. దయచేసి మీడియా గొంతు విప్పి రేవంత్ రెడ్డి అక్రమాలపై మాట్లాడాలని పిలుపునిచ్చారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
