Irrigation Department DE and EE should be suspended for giving false reports on Brahmanikunta pond Sikhum land.
AIFB డిమాండ్
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి పట్టణ కేంద్రంలో బ్రాహ్మణకుంట కుంట (చెరువు) శిఖం భూమికీ ఎఫ్డిఎల్, బఫర్ జోన్ చెరువు శిఖంలోనే నిర్ణయించి కబ్జాదాలకు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి సహకరించిన నీటిపారుల శాఖ డిఈ, ఈఈ లను సస్పెండ్ చేయాలనీ, బ్రాహ్మణకుంట చెరువు శిఖం భూమికి రీ సర్వే నిర్వహించి ఎన్టీఎల్, బఫర్ జోన్ హద్దులు నిర్ణయించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ లు సుధాకర్ రెడ్డి గారికి, అశోక్ కుమార్ ఫిర్యాదు చేయడం జరిగినది.
( నీటిపారుదల శాఖ ఆఫీసులో లేకుంటే ఫోన్ లో సమాచారం చెప్పి వాట్సప్ చేయడం జరిగింది.)
ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ బ్రాహ్మణకుంట కుంట శిఖం భూమి యథేచ్ఛగా కబ్జాకు గురవుతుంది. పట్టా నెంబరు చూపుతూ కుంట (చెరువు) శిఖంలో ప్లాట్ల అమ్మకాలు చేస్తున్నారు. కుంట శిఖం భూమి పక్కనే పట్టా భూమి 301ని చూపుతూ దాని పక్కనే బ్రాహ్మణకుంట శిఖం భూమి సర్వేనెంబరు 300 లో ప్లాట్ల విక్రయాలను జరుపుతున్నారని నీటిపారుదల శాఖ డిఈ, ఈఈ లకు పిర్యాదు చేసిన పట్టించుకోనకుండా రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్న కబ్జాదారులతో కుమ్మక్కై ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ చెరువు శిఖంలోనే నిర్ణయించడం దిగ్గిచేటని విమర్శించారు.
సమాచార హక్కు చట్టం ద్వారా నీటిపారుదల శాఖకు దరఖాస్తు పెడితే డిఈ మా డిపార్ట్మెంట్ నుండి బ్రాహ్మణికుంటకు ఎఫ్.టి.ఎల్ బఫర్ జోన్ నిర్ణయించలేదని అధికారికంగా లిఖితపూర్వకంగా వ్రాసి ఇవ్వడం జరిగినది. మేము చొప్పదండి తహసిల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడగగా నీటిపారుదల శాఖ డిఈ, అధికారికంగా బ్రహ్మణికుంట చెరువు శిఖంలోనే ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ నిర్ణయించినట్లుగాను, దాని యొక్క మ్యాప్ కూడా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగినది. దీన్నిబట్టి చూస్తే చెరువు శిఖం కబ్జా చేసిన కబ్జాదారులతో డిఈ, ఈఈలు కుమ్మక్కయ్యారని అర్థం అవుతుందని అన్నారు. దీని వెనక పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లుగా తెలుస్తున్నదని ఆరోపించారు. వీరు ఇద్దరు దాదాపు గత నాలుగు లేదా ఐదు సంవత్సరాల నుండి వారు నీటిపారుదల శాఖలో చూస్తున్న ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేస్తూ అడ్డగోలుగా ఆదాయానికి మించి డబ్బులు సంపాదించినట్లుగా ఆరోపణలు ఉన్నాయిని ఆరోపించారు.
వీరిపైన మా వద్ద ఉన్న ఆధారాలతో ఇన్కం టాక్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నీటిపారుదల శాఖ నుండి డిఈ, ఈఈ లు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ రిపోర్టు ఇచ్చేముందు ప్రభుత్వ నిబంధనలు ఏవి పాటించకుండా కబ్జాదారులకు రియల్ ఎస్టేట్ చేసుకునేవారికి అనుకూలంగా రిపోర్టు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. చెరువు శిఖం భూములను కాపాడాల్సిన నీటిపారుల శాఖ డిఈ, ఈఈ అధికారులే కబ్జాదారులతో కుమ్మక్కై కబ్జాలకు సహకరిస్తూ రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అన్ని రకాల సహకారాలు చేస్తున్నారు. వీరిద్దరి పైన విజిలెన్స్ అధికారులతో సమగ్ర విచారణ చేసి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నీటిపారుదల శాఖ ఇచ్చిన తప్పుడు రిపోర్టులతో కబ్జాదారులు చెరువు శిఖం భూములను కబ్జా చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారని ఆరోపించారు. చొప్పదండి పట్టణంలోని బ్రాహ్మణకుంట కుంట శిఖం భూమికి రీ సర్వే నిర్వహించి ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ హద్దులు నిర్ణయించాలని, చెరువు శిఖం భూముల ఎవరైనా నిర్మాణాలు చేస్తే ఆ నిర్మాణాలను కూల్చివేయాలని, చెరువు శిఖం భూములను కబ్జాదారుల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు.
నాతో పాటు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె. బద్రి నేత, బేక్కంటి రమేష్ ఉన్నారు.
బండారి శేఖర్
ప్రధాన కార్యదర్శి
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
కరీంనగర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App