TRINETHRAM NEWS

అదానీపై జేపీసీతో విచారణ జరిపించండి: వైఎస్ షర్మిల

Trinethram News : Andhra Pradesh : ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై వెంటనే జేపీసీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని మోదీ ప్రభుత్వాన్ని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అలాగే గౌతమ్ అదానీ వద్ద వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ముడుపులు తీసుకున్న వ్యవహారంలో ఏసీబీ రంగంలోకి దింపి విచారణ చేపట్టేలా ఆదేశించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

బుధవారం విజయవాడలో గౌతమ్ అదానీపై చర్యలు తీసుకోవాలంటూ ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఛలో రాజ్‌భవన్ యాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్రను నగర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల చర్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App