గిరిజన విద్యుత్తు క్యాలెండర్ ఆవిష్కరణ
అరకులోయ,త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్.జనవరి 23.
అరకువేలిలో దొన్నుదొర నివాస గృహంలో నేడు రాష్ట్ర గిరిజన విద్యుత్ శాఖ క్యాలండర్, డైరీ లను ఆవిష్కరణ జిరిగింది.అనంతరం విద్యుత్ శాఖ ఏఈ,లైన్ మెన్ లతో సమావేశం ఏర్పాటు చేసి,వారి సమస్యలు తెలుసుకున్నారు.ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. అనంతరం లైన్ మెన్ లు కొంత మంది మైదానా ప్రాంత బదిలీలతో కొంత మేరకు ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.
పై అధికారులతో మాట్లాడి సమస్యలనూ పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరకువేలి విద్యుత్ శాఖ ఏఈ సత్యనారాయణ,లైన్ మెన్స్ మంగారాజు,రామప్రసాద్,దాసు, బుద్ధు,అభి,గోపి,అప్పలరాజు,గోపాల్,బుద్ర,చిన్న పాల్గొన్నారు.లైన్మెన్ మంగరాజు మాట్లాడుతు అరకులోయ మండల పరిధిలో,ఎల్లవేళ గిరిజనులకు కరెంట్ అసౌకర్యం కలగకుండా చూస్తాం అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App