ఆదివాసి సాంస్కృతిక మహోత్సవముల గోడపత్రికలు ఆవిష్కరణ
Trinethram News :రాజానగరం : ఫిబ్రవరి 5, 6 తేదీలలో రాజమండ్రి నందు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఎన్.టి.ఆర్ కన్వెన్షన్ ఆడిటోరియం నందు ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ (టీ ఎస్ ఎఫ్ ) ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఆదివాసి సాంస్కృతిక మహోత్సవములు గోడ పత్రికలను ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ (టీ.ఎస్.ఎఫ్) నాయకులు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ఆదివాసి గిరిజన ప్రజలదేనని వారన్నారు.
రాజానగరం లోనీ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగే జాతి స్థాయి గిరిజన సాంస్కృతిక మహోత్సములు కార్యక్రమాన్ని గిరిజన విద్యార్థులు, ఆదివాసీ ప్రజలు పాల్గొని ఆదివాసీ సంస్కృతులను, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాలని వారు అన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ (టీ ఎస్ ఎఫ్) వ్యవస్థాపకులు మల్లి భాస్కర్, జాతీయ అధ్యక్షులు కె.అక్కులప్పనాయక్, ప్రధాన కార్యదర్శి మూడవతు విష్ణునాయక్, జాతీయ ప్రధాన కార్యదర్శి పల్లాల రాజకుమారరెడ్డి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఆర్.సుమిత్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సుదర్శన్, విశ్వవిద్యాలయ విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు,ప్రసాద్ నాయక్, చిన్న, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App