TRINETHRAM NEWS

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల ఎంపీపీ సోనారి. రత్నకుమారి అధ్యక్షణ జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిలుగా ,తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి, జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా!! వంపూరు గంగులయ్య ,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్ర నాగరాజు , మాజీ ఎంపీపీ లు ఏస్.వివి.రమణ మూర్తి, బొర్రా. విజయరాణి, ఎంపీటీసీలు ,అనేకమంది సర్పంచ్లు, అధికారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా ఈ సమావేశంలో గంగులయ్య ప్రసంగిస్తూ అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, సమన్వయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి, అభివృద్ది సంక్షేమ,కార్యక్రమాలు ప్రజలకు, అందేటట్లు పూర్తి పారదర్శకంగా పాటించాలని కోరడం జరిగింది… గ్రామాల్లో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూటమి నాయకులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది.. అనంతరం కూటమి నాయకులకు ఘనంగా సన్మానించడం జరిగింది..ఈ సమావేశంలో అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు*

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App