Inspection of helipad, paving, meeting areas
డిప్యూటీ సీఎం పర్యటన సందర్భంగా ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్
హెలిప్యాడ్, శంకుస్థాపన, మీటింగ్ ప్రాంతాల పరిశీలన
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రేపు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పెద్దపల్లి జిల్లాలోని నంది మేడారం వద్ద హెలిప్యాడ్, కాచపూర్, పెద్దపల్లి, రంగాపూర్, రాఘవపూర్, కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్ కలిసి భద్రత ఏర్పాట్లు , బందోబస్తు ఏర్పాట్లను నంది మేడారం లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, ధర్మారం, కాచాపూర్, పెద్దపల్లి రంగాపూర్, రాఘవ పూర్ లలో పలు సబ్ స్టేషన్ ల భూమి పూజ, శంకుస్థాపన చేసే స్థలాలు, ధర్మారం లోని వ్యవసాయ మార్కెట్, పెద్దపల్లి జెండా చౌరస్తా లలో సభ వేదికలను సందర్శించి భద్రత పరమైన ఏర్పాట్లను పరిశీలించారు.
సభ ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, సభకు వచ్చే మార్గాలపై అధికారులతో పోలీస్ కమిషనర్ చర్చించి డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతాలలో పూర్తిస్థాయిలో నిఘా, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లకు అవసరమైన చర్యలపై పోలీస్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భద్రత చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలకు, ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పర్యటన సజావుగా సాగేలా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపడుతునట్లు తెలిపారు.
కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్, ఎస్ఐ లు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App