అరకువేలీ లో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్ల దీక్ష.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్, డిసెంబర్.27 :
అరకువేలి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద తేది: 26;27;28 మూడు రోజులపాటు జరిగే గ్రామ వాలంటీర్ల దీక్ష ప్రారంభం జరిగింది.
ఈ దీక్షను సిఐటియు మండల కార్యదర్శి జన్ని భగత్ రామ్, ప్రారంభించారు. భగత్ రామ్ మాట్లాడుతూ,
గ్రామస్థాయిలో అనేక సేవలు చేస్తూ గ్రామ వాలంటీర్లుగా గ్రామ సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న గ్రామ వార్డు వాలంటీర్లను, చంద్రబాబునాయుడు, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన
హామీ పదివేల రూపాయలు వేతనాల వెంటనే అమలు చేయాలని, వాలంటీర్లను ఉద్యోగ భద్రత కల్పించాలని, విధుల కు రాజినామా చేసిన వాలంటీర్లను అవకాశం కల్పించాలని, వాలంటరీ వ్యవస్థను చట్టబద్ధత చేయాలని, బకాయిలో ఉన్న వేతనాలు చెల్లించాలని, డిమాండ్ చేస్తూ ఈ దీక్ష నిర్వహించడం జరుగుతుంది.
ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థపై స్పష్టత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. వాలంటరీ వ్యవస్థను రాజకీయాల కోణంలో చూడకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేసి, వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా ఉన్న వాలంటీర్లను గత ప్రభుత్వం రాజకీయంగా వాడుకొని సరైన విధి విధానాలు రూపొందించకుండా కేవలం వారి చేత వెట్టిచాకరి పని చేయించుకున్నారని అన్నారు. చదువుకున్న యువతి, యువకులకు, నిరుద్యోగులకు, ఉపాధి కల్పించవలసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరైనది కాదు,ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడంతో వాలంటరీ ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వి. మధు, కార్యదర్శి ఎస్. ఆనందరావు, కే. జాను బాబు, ఎస్ .రాజబాబు,బి. బుచ్చన్న, డి.అరుణ, కే జయరాం, కె .రాము, కె. కృష్ణ, జి .వెంకటరావు, వి. ధర్మ ,మాణిక్యం కే. మోహన్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App