భారత పౌరులు తక్షణమే సిరియాను వీడండి!
Trinethram News : సిరియా : డిసెంబర్ 07
దశాబ్దం పాటు అంతర్యు ద్ధంతో తల్లడిల్లి గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటు దారులు మళ్లీ రెచ్చిపోతు న్నారు. బషర్ అల్ -అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాలను వెనక్కినెడుతూ ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తు న్నారు.
ఇప్పటికే అనేక కీలక పట్టణాలను వారు తమ నియంత్రణలోకి తెచ్చుకు న్నట్లు తెలుస్తోంది. సిరియా రాజధాని డమాస్కస్ నగరాన్ని కూడా ఆక్రమిం చేందుకు తిరుబాటుదా రులు ప్రయత్నాలు మొద లు పెట్టారు. అదేజరిగితే సిరియా పూర్తిగా రెబల్స్ చేతిలోకి వెళ్లిపోతుంది.
ఈ క్రమంలో సిరియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎటునుంచి ప్రమాదం పొంచివస్తుందోనని అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ అర్ధరాత్రి వేళ కీలక ప్రకటన జారీ చేసింది.
భారతీయ పౌరులు తదు పరి ఆదేశాలు వచ్చేవరకు సిరియాకు వెళ్లొద్దని, సిరియాలో ఉన్నవారు వెంటనే ఆ దేశాన్ని వీడాలంటూ శుక్రవారం అర్ధరాత్రి తరువాత భారత విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది.
సిరియాలో ఉన్న భారతీ యులు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని, అత్యవ సర పరిస్థితుల్లో డమాస్కస్ లోని ఇండియన్ ఎంబసీతో టచ్ లో ఉండాలని సూచించింది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App