ఏఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో ఎన్.హెచ్.ఎం. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ యూనియన్ క్యాలెండర్ 2025 ఆవిష్కరణ
హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
05 జనవరి 2024
యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణలో ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నర్సింహ డిమాండ్ నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) లో గత 25 సంవత్సరాలుగా దాదాపు 17 వేల మంది ఉద్యోగులు వివిధ కేటగిరి లో కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి. ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయకుండా ప్రభుత్వాలు గతంలో తీవ్ర అన్యాయాన్ని చేశాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. బాలరాజు విమర్శించారు. నేడు హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల రెగ్యులర్ ఉద్యోగుల యొక్క బేసిక్ వేతనం కాంట్రాక్ట్ ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ కనీస వేతనాలు అమలు పరచాలని ఉన్నప్పటికీ దానిని గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని భవిష్యత్తులో వీరికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్.హెచ్.ఎం. కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం కాంట్రాక్టు సిబ్బందికి జరిగిన అన్యాయంపై గతంలో అనేక పోరాటాలు నిర్వహించటం ద్వారా వారి సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేసి సమస్యలను పరిష్కరిస్తామని గతంలో ఉన్నటువంటి అధికారులు తెలియజేశారని ఎన్.హెచ్.ఎం.డైరెక్టర్ ఆర్.వీ.కర్ణన్ వారి సమస్యలపై దృష్టి సారించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారి సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాము వచ్చి ఏడాది అవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలపై చర్చించి న్యాయం చేసేటట్టుగా ఈ సభ ముఖంగా తెలియజేయడం జరిగింది. యూనియన్ ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రాలు అందజేయ నున్నట్లు వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్రమణ్యం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జ్యోతి, ఎన్.హెచ్.ఎం.రాష్ట్ర నాయకులు మంగలపాటి సుమన్ , కవిత ,ఉప్పలయ్య, నరసింహ, కవిత, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App