కనగర్తి లో ఇట్యాల వెంకటయ్య సంస్మరణ సభలో పుస్తకాల ఆవిష్కరణ.
ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి.
ఓదెల మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో ఆదివారం
కోరుట్ల తాసిల్దార్ ఇట్యాల వెంకట కిషన్ తండ్రి ఇట్యాల వెంకటయ్య సంస్మరణ సభలో ఇట్యాల వెంకట కిచెన్ తండ్రి స్మారకార్థం రాసిన పుస్తకాలు ” గ్రామ చరిత్ర” మరియు”ధరణి”, ” నీ కొనసాగింపుగా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, నాయకులు తాళ్ళపెల్లి మల్లయ్య, లక్ష్మణ్, మధుసూదన్ రావు, దయా నర్సింగ్ తో పాటు కళాకారులు, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా కే.స్వామి మాట్లాడుతూ ఇట్యాల వెంకటయ్య కనగర్తి లో కమ్యూనిస్ట్ పార్టీ లో ఉంటూ పార్టీ నిర్మాణం కోసం కృషి చేశారని, గ్రామ ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన నాయకుడు అని ఆయన అన్నారు. వెంకటయ్య కుమారుడు వెంకట కిషన్ కోరుట్ల తాహిసిల్దర్ గా ఉద్యోగం చేస్తూ,తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ఆయన స్మారకార్థం రెండు పుస్తకాలు రాసి ఈరోజు తన స్వగ్రామం కనగర్తి లో జరిగిన వారి తండ్రి సంస్మరణ సభలో ఆవిష్కరణ చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App