జనసేన నేత వంపూరు గంగులయ్య పై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్: అల్లూరి సీతారామరాజు జిల్లా
పాడేరు,జి.మాడుగుల,చింతపల్లి,గూడెం,కొయ్యూరు
పాడేరు నియోజకవర్గం జనసేన పార్టీ 5మండలాల అధ్యక్షుల సంయుక్త ప్రకటన.
గిరిజన ప్రాంతంలో జనసేన పార్టీ బలోపేతానికి, ఎదుగుదలకు నిర్విరామంగా ఎంతో కృషి చేసిన పాడేరు నియోజకవర్గం ఇంచార్జీ అయిన, డా.గంగులయ్య గారిపైన చింతపల్లి మండల అధ్యక్షులు బుజ్జి బాబు,పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడు దూరంగా వుండే కార్యకర్త వాడకాని వినయ్ వాక్యాలు వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని తెలియజేస్తున్నాం.కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పొత్తుల్లో బాగంగా టికెట్ అవకాశాలు కోల్పోయిన అభ్యర్థులకు నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని కూటమి అధిష్ఠాన పెద్దలు ముందే చెప్పియున్నారు.ఇటువంటి సమయంలో జనసేన పార్టీ జిల్లా ఇంచార్జీ గా ఉన్న గంగులయ్య గారికి జీసీసీ బోర్డు డైరెక్టర్ గా నియమించడం మా పార్టీ జనసైనికులకు,నాయకులకు,గిరిజన ప్రజానీకానికి పూర్తిగా నిరాశపరిచింది. గిరిజన ప్రజల మనోభావాల దెబ్బతినేలా కూటమి ఆలోచన చేసిందని ఇంకోమారు ఆలోచన చేసి కేటాయింపులు చేయాల్సిందిగా మేమంతా మూకుమ్మడిగా మా పార్టీ అధిష్ఠానానికి తెలియజేసాము. అడగనిదే అమ్మైన అన్నం పెట్టదంటారు! అదేవిధంగా మా అభ్యర్థన తెలియజేసాము.మా ఇంచార్జీ గంగులయ్య కూడా అతని ఆవేదన పార్టీ వర్గాలకు తెలియజేశారు.అతన్ని నమ్మిన గిరిజన ప్రజల ఆవేదనని తెలియజేసే ప్రయత్నం చేశారు.అతనికి భావప్రకటన స్వేచ్ఛ వున్నది.అంతే కానీ ఎక్కడ కూడా పార్టీ సిద్ధాంతాలకు గానీ,పార్టీ విధివిధానాలను గానీ విమర్శించలేదు.ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకుండా చింతపల్లి మండల అధ్యక్షులు బుజ్జిబాబు, కార్యకర్త వాడకాని వినయ్ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా విమర్శలు చేయడం వారి రాజకీయ పరిపక్వత కి నిదర్శనం.అదే విధంగా కొంతమంది పార్టీ నాయకులమని చెప్పుకునే వాళ్ళు పార్టీ నిర్మాణానికి గానీ,బలోపేతానికి గానీ కృషి చేయరు. ఎక్కడో వుంటూ, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంటారు. ఈ కోవకే చెందుతారు వీళ్ళు .కేవలం వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్తున్న బుజ్జి బాబు గారికి ఏ కార్యక్రమాలు పార్టీ పరమైన సమావేశాలు చేయలేనటువంటి వ్యక్తులు తోడయ్యారు. ఇలా ఏరు దాటి తెప్ప తగలేసేతటువంటి వ్యక్తులపై కచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే? అలాగే ఎవరైనా కూడా రాజకీయ శక్తిగా ఎదగడానికి తమవంతు నిస్వార్థ గుణంతో సిద్ధాంతపరమైన ఆలోచనతో ప్రజలను ఆకట్టుకోవాలి, ఇలా పార్టీ నాయకులపై వారు ఏమి మాట్లాడారో ఏ అంశం తెలియజేసారో తెలుసుకోకుండా ఇష్టానుసారం పత్రిక ప్రకటనలు ఇచ్చే వ్యక్తులు జనసేన పార్టీలో ఇమడలేరు. గిరిజన ప్రాంతంలో జనసేన పార్టీ ఎదుగుతున్న మాట వాస్తవం ఈ విషయం ప్రత్యర్థులకు కూడా తెలుసు ఇదే అదనుగా భావించి పార్టీ ఎదుగుదల నచ్చని వ్యక్తులు చేసే ట్రాఫ్ లో ఇటువంటి బుద్ధిలేని వారు పడిపోతున్నారు.అలాగే గత ఎన్నికల్లో కూటమి ఓటమికి కారణం అభ్యర్థి ఎంపికలో జరిగిన తప్పులు, ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే అలాగే ఏ పార్టీ అభ్యర్థికి అయినా మెజారిటీ గిరిజన ప్రజలకు,పార్టీలకు అతీతంగా నచ్చాల్సి వుంటుంది. ఆ విషయంలో గిరిజన ప్రజలు పూర్తిగా వాస్తవ పరిస్థితులు, అభ్యర్థులు వారి అసలైన వైఖరి నీ చూసి గుడ్డీ కంటే మెల్ల, నయమని తప్పని పరిస్థితుల్లో ఎన్నుకున్నారు. అంతే కానీ ఇందులో జనసేన పార్టీ నాయకుల తప్పేమిలేదు. కేవలం గిరిజన ప్రజలు తమకు దక్కిన రాజ్యాధికారం విషయంలో అన్యుల పెత్తనం ఏమిటనేది,వారి ప్రమేయమేమిటనేది వారికున్న ప్రధాన భావన. ఇదిగో ఈ విషయమే కూటమి అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణం అయ్యింది.ఇటువంటి విషయాల్లో చైతన్యంలేని కొంతమంది జనసేన పార్టీ నాయకులైన బుజ్జిబాబు తల తిక్క ప్రకటనలు చేస్తూ వైసీపీ ట్రాప్ లో పడిపోయారు. సరదాగ ఫోటో దిగుదామని చెప్పి ఇటువంటి అసంబంద కట్టుకథలు వార్తలు గా రాసి పార్టీ నీ నిర్వీర్యం చేసే కుట్రలు చేసినవారికి జనసేన పార్టీ క్షమిస్తుందంటే కష్టమే! కచ్చితంగా అసలైన వాస్తవాలు,నిజాలు తెలిసేలా మా పార్టీ అధిష్ఠానానికి తెలియజేస్తూనే ఇటువంటి వ్యక్తుల విషయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని,
ఉల్లి సీతారామ్, జిల్లా కార్యదర్శి జనసేన పార్టీ (చింతపల్లి)
పాడేరు మండల అధ్యక్షులు
నందోళీ మురళీ కృష్ణ
. మాసడి భీమన్న(జి.మాడుగుల మండల అధ్యక్షులు).
కొయ్యాం బాలరాజు(గూడెం మండల అధ్యక్షులు)
గూడెపు లక్ష్మణ రావు(కొయ్యూరు మండల అధ్యక్షులు), సాగిన. బుజ్జి బాబు ( ముఖ్య క్రియాశీల సభ్యుడు)
సీనియర్ నాయకులు.గొర్లే వెంకట్, గూడెం మండలం
జనసేన పార్టీ ఐటి విభాగం అధ్యక్షులు అశోక్ సాలెబు, ఈ ఐదు మండలాల అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App