ఐదేళ్లలో అప్పులపాలైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం…
ఏడాదిపాటు ఇబ్బందులుంటాయని ముందే ఊహించాం…
దావోస్ పర్యటనతో పెట్టుబడులు, ఉద్యోగాలకు ఆస్కారం…
వైసిపి హయాంలో పెట్టుబడిదారులు పారిపోయారు…
అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయే కూటమి రెండుకళ్ళు…
ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తాం ఎమ్మెల్యే గోరంట్ల…
Trinethram News : Andhra Pradesh : రాష్ట్రంలో వైసిపి హయాంలో అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో అప్పులపాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందోనని టీడిపి సీనియర్ నేత, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. గడిచిన ఐదేళ్లలో కుంటుపడిన అభివృద్ధి ని మళ్ళీ పట్టాలెక్కిస్తు న్నామన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల మంగళవారం ఉదయం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ టీమ్ జరిపిన దావోస్ పర్యటనతో ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు, నాలుగు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. పదవి కోల్పోయినా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ద్వారా కూటమిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోరంట్ల విమర్శించారు. జగన్ పాలనలో పెట్టుబడులు వెనక్కు పోయాయని, పారిశ్రామిక విధానం విచ్చినం చేసేశారని, ఫలితంగా పెట్టుబడి దారులు పారిపోయారని ఆయన విమర్శించారు. విశాఖ , రాయలసీమ కేంద్రాలుగా కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు రాబోతున్నాయని, ప్రతి జిల్లాను ఒక యూనిట్ గా పరిశ్రమలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు.
గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసి, అన్ని రంగాలను దెబ్బతీయడం వలన సరిచేయడానికి ఏడాది సమయం పడుతుందని ముందే ఊహించామని గోరంట్ల అన్నారు. చేసిన అప్పులపై వడ్డీలు కట్టడానికి, బకాయిలు తీర్చడానికే నిధులన్నీ సరిపోతున్నాయని అయన చెప్పారు. అయినప్పటికీ ఒక్కొక్కటి ప్రభుత్వం చేసుకు వస్తోందని, ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని అయన స్పష్టం చేసారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఫీజు రీ ఇంబర్స్ మెంట్ వంటివన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తామమని గోరంట్ల చెప్పారు. వచ్చే బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని ఆయన సూచించారు. అభివృద్ధి సంక్షేమం రెండుకళ్లుగా భావించి ప్రణాళికా బద్ధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మల్టీ లెవెల్ అభివృద్ధి దిశగా ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని గోరంట్ల చెప్పారు. పరిశ్రమలు, సంస్థలు స్థాపించే కృషి జరుగుతోందన్నారు.
కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకుని అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్లు గోరంట్ల చెప్పారు. వైసిపి హయాంలో నిర్లక్ష్యం చేసియాన్ రోడ్లు ఇప్పుడు వేగంగా వేస్తున్నామని ఆయన చెప్పారు.
పార్టీ మారినాసరే తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు డబ్బుంటే పార్టీలు మారితే చాలు అనుకునే వాళ్ళనీ మేము సహించబోమని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఒక ప్రశ్నకు సమాధానంగా గోరంట్ల వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంలో వేల ఎకరాలు దోచుకుని, కోట్లాది రూపాయలు దోపిడీ చేసారని, అప్పుడూ ఇప్పుడూ కూడా ఆయన ఏ 2 అనే సంగతి మరిచిపోతే ఎలాగని ఆయన చురకలంటించారు. ప్రతిపక్షంలో ఉండే కేసులు పెట్టకుండా ఏడిపించడం ఉన్నవాళ్లు వస్తే పర్వాలేదు… కేసులు పెట్టి రౌడీయిజం చేసే వాళ్ళు మాకొద్దు అని ఆయన స్పష్టంచేసారు. రాబోయే రెండేళ్లలో వైఎస్ఆర్సిపిని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టలేడని ఆయన విశ్లేషించారు. పార్టీకోసం కష్టపడి అంకితభావంతోపనిచేసిన నాయకుల్ని కార్యకర్తలను ప్రోత్సహించాలని, వైసిపి హయాంలో ఎన్నో ఒడిడుకులు ఇబ్బందులు ఎదుర్కొని పనిచేసినవార్ని గుర్తించాల్సి ఉందని ఆయన స్పష్టంచేశారు..డయాఫ్రమ్ వాల్ అంటే తెలియనివాడు ఇరిగేషన్ మంత్రి చేసిన వ్యక్తి అంబటి… వీరి అసమర్ధత వల్ల డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని మరో ప్రశ్నకు సమాధానంగా గోరంట్ల వ్యాఖ్యానించారు.
పంచాయితీలు మర్జింగ్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి…రూరల్ లో కొన్ని సిటీ లో కలిసి పోయాయి, కోర్టు కేసులు క్లియర్ చేసి, ఎన్నికలు పెట్టాలి అని గోరంట్ల వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల నుండి మేయర్ మున్సిపల్ ఎన్నికలు జరగక పోవడం మామూలు విషయం కాదని అన్నారు. మేయర్ సీటుని అందరూ ఆశించడం సహజమని అయితే పార్టీలన్నీ కూర్చుని నిర్ణయం చేస్తాయని అన్నారు. .రాజమండ్రి సీటు మీద..రూరల్ పైన నాకు మంచి పట్టు ఉందని, బుచ్చయ్య చౌదరిని ఎవరు ఏమార్చలేరని ఆయన అన్నారు. ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, జిల్లా తెదేపా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ సమావేశంలో పాల్గొన్నారు.