Trinethram News : ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదలు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ సాధారణంగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ మళ్లీ వాటిని తిరిగి సరిచేశారు టెక్నికల్ సిబ్బంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులుదీరారు. ఏపీలో ఉదయం 11 వరకు 23.4 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపారు. అలాగే తెలంగాణలో కూడా 11 వరకు 24.31శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు ఎన్నికల అధికారులు.
పలు ప్రాంతాల్లో వాతారణం సహకరించకపోయినప్పటికీ ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు ఓటర్లు. అలాగే పలు పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో కొంతసేపు ఆందోళనకు దిగారు ఓటర్లు. ఇలా చిన్న చిన్న సంఘటనలు మినహా మరెక్కడా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు తలెత్తలేదంటున్నారు అధికారులు. పురుషులకంటే కూడా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఏపీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.26 శాతం పోలింగ్..
తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్ నమోదు