In 11 places in
ప్రకటించిన ఫలితాల్లో 11 చోట్ల ఇండియా కూటమిదే హవా
Trinethram News : న్యూ ఢిల్లీ :జులై 13
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీయే, ఇండియా బ్లాక్ ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవగా.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం.. 11 చోట్ల ఇండియా బ్లాక్ అభ్యర్థుల హవా కొనసాగు తోంది.
మిగతా రెండుచోట్ల ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లోని 4, హిమాచల్ ప్రదేశ్ లోని మూడు, ఉత్తరాఖండ్ లోని రెండు, పంజాబ్, బిహార్, తమిళ నాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.
పంజాబ్‌లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అలాగే పశ్చిమబెంగాల్‌లోని మానిక్‌తలా, బాగ్దా, రాణా ఘాట్ దక్షిణ్, రాయ్‌గంజ్.. మొత్తం నాలుగు స్థానంలో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యం లో కొనసాగుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్య మంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి, కాంగ్రెస్ అభ్యర్థి కమలేశ్ ఠాకుర్ ముందంజలో ఉన్నారు.
నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసా గుతుండగా.. హమీర్‌పుర్ లో బీజేపీ నేత ముందంజ లో ఉన్నారు.
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, మంగలౌర్.. రెండు స్థానాల్లో నూ కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతు న్నారు. మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ధీరన్ షా ముందంజలో ఉన్నారు.
బిహార్‌లోని రూపౌలి స్థానం లో జేడీయూ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతు న్నారు. తమిళనాడులోని విక్రావండిలో డీఎంకే నేత అన్నియుర్ శివ ముందంజ లో ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
mni