గిరిజనుల జీవన ప్రమాణాలు అభివృద్ధి ప్రభుత్వ పథకాలను అమలు
పరచాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ధర్తీ ఆబ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గిరిజన గౌరవ దినోత్సవ సమరోహం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని 100 జిల్లాల గిరిజనులను ఉద్దేశించి మాట్లాడిన సందేశాన్ని దృశ్యమాలిక ద్వారా అధికారులు, గిరిజన ప్రజలు తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. గిరిజన ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు దర్తి ఆబ జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. దేశవ్యాప్తంగా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద జిల్లాలో మొదటి దశగా ఎంపికైన 31 ఆవాసాలను అభివృద్ధి పర్చే దిశగా అధికారులు ప్రాధాన్యతపరంగా పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో జీవనోపాధి, త్రాగునీరు, వైద్య సౌకర్యంతో నాణ్యమైనవిద్యనుఅందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బాలికల నృత్య ప్రదర్శన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కమలాకర్ రెడ్డి, ప్రత్యేక అధికారి ఫణి కుమారి, డి ఎం హెచ్ ఓ వెంకటరమణ, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంక్షేమ అధికారులు, వివిధ గ్రామాల గిరిజన ప్రజలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App