96 quintals of illegal ration rice was chased….District Civil Supplies Department Officer Prem Kumar
సుల్తానాబాద్, జూన్ -13: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలో గురువారం పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో 96 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం నిల్వలు పట్టుకోవడం జరిగిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు.
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ సుల్తానాబాద్ మండలంలోని గట్టెపల్లి రేషన్ దుకాణాలను, ఐతారం ఓపెన్ ఎరియా నందు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలోని రేషన్ షాపు తనిఖీచేసినప్పుడు 52.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఎక్కువగా రేషన్ షాప్ నిల్వలలో గుర్తించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా సుల్తానాబాద్ మండలం ఐతారం వద్ద ఓపెన్ ఏరియాలో 43.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తించామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందనీ, ఎవరైనా రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోబడ తాయని డిసిఎస్ఓ హెచ్చరించారు.
ఈ తనిఖీలలో సంబంధిత అధికారులు, తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App