ఫార్మా రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రైతులపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగాఎత్తివేయాలనిబహుజన ముక్తి పార్టీ (BMP)వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పాత్లావత్ గట్యా నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశానికి అన్నం పెట్టే రైతులను, వజీవనాధారమైన భూమిని లాక్కోవడానికిప్రయత్నం చెయ్యడమేకాకుండావారినిరెచ్చగొట్టేలా అగ్గువ సగ్గువ ప్యాకేజీలు మాట్లాడటంతోనే రైతులు తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఉన్నభూమినివిడువలేకఆవేదనతో అధికారులతో మాట్లాడే సందర్భాన్ని ఒక దాడిగా వర్ణించి, ఆ ఘటనకు రాజకీయ రంగు పులిమి గోరంతదాన్ని కొండంత చేసి దాన్ని భూతద్దంలో చూపెట్టి రైతులు ద్రోహులుఅనడంప్రభుత్వ నీతి మాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. మొన్న అర్థరాత్రి 28 మందిని అరెస్టు చేసి, రెండు రోజులు పరిగి పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టి నిన్న రాత్రి 12 గంటలకుపరిగిప్రభుత్వఆసుపత్రిలో మెడికల్ టెస్టులు చేసి కొడంగల్ కోర్టులో ప్రవేశ పెట్టడం ఎంతవరకు న్యాయమని అన్నారు.మిగతావారుఏమయ్యారోఅధికారులుచెప్పాలనిడిమాండ్ చేశారు.ఘటనజరిగినప్పుడుస్వయంగా ఉన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారే ఇది అనుకోకుండా జరిగింది తప్పఉద్యేశ్యపూర్వకంగాజరగలేదని ప్రకటన చేసినా ప్రభుత్వం ఎందుకు ఆ ఘటనను పెద్దదిగాచేస్తుందో చెప్పాలని అడిగారు.కలెక్టర్ గారు ఈ జిల్లాకు మేజిస్ట్రేట్ అనికూడాగుర్తుచేశారు. మరి మేజిస్ట్రేట్ గారి ప్రకటన లేదా నిర్ధారణ కూడ పరిగణనలోకి తీసుకోరా అని ప్రశ్నించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిని పరువు సమస్యగా చూడకుండా అక్కడి రైతుల జీవన్మరణ సమస్యగా చూడాలని, వెంబడే అక్రమ కేసులను, వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో లంబాడి ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీఎంపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి గోవింద్ నాయక్, బీఎంపీ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షలు నేనావత్ హరి నాయక్, బీఎంపీ దోమ మండల అధ్యక్షులు రవీందర్ నాయక్,తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App