తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయ్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
ట్రైబ్యునళ్ల ఆదేశాల్ని అనుసరించిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయొచ్చు జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టీకరణ_
తల్లిదండ్రుల చేత ఆస్తుల్ని రాయించుకొని, వృద్ధాప్యంలో వారి బాగోగులను పట్టించుకోకుండా. వారి పట్ల కర్కశంగా వ్యవహరించే వారసులకు హెచ్చరిక. తల్లిదండ్రుల సంరక్షణ పరంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే బిడ్డల విషయంలో ఆర్డీఓ నేతృత్వంలోని ట్రైబ్యునల్ ఇచ్చే ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని గిఫ్ట్/సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఆదేశించింది. పిల్లలు నరకం చూపిస్తుండటంతో తమకు న్యాయం చేయాలంటూ పలువురు తల్లిదండ్రులు ట్రైబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారు. వృద్ధులఅభ్యర్థనలపై ఆర్డీఓ విచారణ జరిపి ఇచ్చే ఆదేశాల ఆధారంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయవచ్చునని… రిజిస్ట్రేషన్,స్టాంపుల శాఖ ఐజీ ఎం.శేషగిరిబాబు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు కార్డ్ సాఫ్ట్‌వేర్‌లో ‘పోస్టు రిజిస్ట్రేషన్ ఈవెంట్స్’ కింద వివరాలనమోదుకు ఇప్పటికే ఆప్షన్ ఉందని అందులో పేర్కొన్నారు.వృద్ధుల ఆస్తులరిజిస్ట్రేషన్ల రద్దుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల్లో నెలకొన్న సందిగ్ధత దృష్ట్యా ఈ ఉత్తర్వులిచ్చారు.
మాట తప్పితే అంతే సంగతులు. వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చి, వారి నుంచి ఆస్తులు పొందిన పిల్లలు ఆ తర్వాత మాట తప్పుతున్నారు. పెద్దలను నడ్డిరోడ్డున పడేస్తున్నారు. నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులు. తమ వారసులకు ఇచ్చిన ఆస్తులను రద్దు చేసుకునే హక్కునుతల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం-2007’కల్పిస్తుంది. పిల్లలకు బదిలీచేసిన ఆస్తులపైతల్లిదండ్రులకు తిరిగి యాజమాన్య హక్కులులభించేలా ఆదేశించే అధికారంట్రైబ్యునళ్లకు ఉంది. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి కుమారులు, కుమార్తెలదేనని ఇటీవలసుప్రీంకోర్టు స్పష్టంచేసిన సంగతి విదితమే. ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారి ఆస్తిని పొందేహక్కులేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులుచూసుకుంటానని హామీ ఇచ్చి.. వారి నుంచి ఆస్తిని పొందిన ఓ వ్యక్తి మాటతప్పగా.. అతనికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కులను కోర్టు పునరుద్ధరించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App