TRINETHRAM NEWS

గని పై అంబులెన్స్ ఉంటే కార్మికుడు బ్రతికేవాడు సీఐటీయూ

తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు,

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు అర్జి1, జీడికే టు ఇంక్లైన్లో ఉదయం ఏడు గంటలకు విధులకు హాజరై హఠాత్తుగా మరణించిన, యువ కార్మికుడు గొల్లపల్లి నరేష్, కోల్ కట్టర్ కుటుంబానికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే సింగరేణిలో సేఫ్టీ కమిటీలు నిర్వహించు కున్నప్పటికి ఈరోజు కార్మికునికి ఆరోగ్యం పట్ల ఇవ్వాల్సిన భద్రతను ఇవ్వలేకపోవడంతో గుండెపోటుతో మస్టర్ పడినాక గొల్లపల్లి నరేష్ అనే యువ కోల్ కట్టర్ కార్మికుడు చనిపోవడం చాలా బాధాకరమైనది. వ్యక్తిగత భద్రత అంటూ ప్రతి సమయంలో ఊదరగొట్టే సింగరేణి యాజమాన్యం హెల్మెట్ పెట్టుకోకపోతే లెటర్లు ఇచ్చుకుంటూ బెదిరింపులు చేస్తూ వ్యక్తిగత భద్రత ముఖ్యమని చెప్తున్న సింగరేణి యాజమాన్యం ఒకే దగ్గర నాలుగు గనులు క్సప్ 1, జీడికే -1, 2, 2A ఇంక్లైన్ ఉన్నప్పటికీ కనీసం ఒక అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంచకపోవడం వల్లనే కార్మికుడు మృతి చెందాడని కార్మికుల ఆరోగ్యం పట్ల యాజమాన్యం ఏవిధంగా ప్రవర్తిస్తుందో దీనితో అర్థమవుతుందని అన్నారు.

గని పైన ఫస్ట్ సైడ్ కిట్లు సరిగ్గా లేకపోవడం మరియు అవసరానికి సిపిఆర్ఎంఎస్ వంటివి సర్ఫేస్ లో ఉండేవారికి ట్రైనింగ్ ఇచ్చి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన యాజమాన్యం ఉత్పత్తి ద్యేయంగా ముందుకు పోతున్నదని విమర్శించారు. అసలు ప్రతి గని పైన అంబులెన్స్ ఉండాలని ఒప్పందం ఉన్నప్పటికీ యాజమాన్యం దానిని తుంగలో తొక్కి ఉన్నత అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే వారికి చూపెడుతూ కాలం గడుపుతున్నరాని అలా కాకుండా ఇప్పటికైనా యాజమాన్యం ఒక్కో తప్పిదం నుండి ఒక్కో గుణపాఠం నేర్చుకోవాల్సి ఉండగా అలా కాకుండా మొద్దు నిద్ర నటిస్తూ పోతున్నదని ఇప్పటికైనా యాజమాన్యం ఇటువంటి మరణాలు జరగకుండా ప్రతి గని పైన ఫస్ట్ ఎయిడ్ మరియు సిపిఆర్ఎంఎస్ గురించి తెలిసిన వారిని అందుబాటులో ఉంచాలని అన్ని సౌకర్యాలతో కూడిన సంజీవని లాంటి అంబులెన్స్లను సైతం అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇంటి నుండే రక్షణ మొదలవ్వాలని చెప్తున్న యాజమాన్యం పని ప్రదేశాల్లోనూ సరైన సౌకర్యాలు కల్పించక పోవడం కార్మిక కాలనీలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం లేదని సరైన మంచినీరు గాలి వంటివి ఉండకుండా పోవడంతో అనేక రోగాలు వస్తున్నాయని చివరకు ఆసుపత్రికి వెళ్లిన సరైన వైద్యం దొరకకపోవడంతో ఇలాంటి యువ కార్మికులు సైతం రోగాల బారిన పడుతున్నారన్నారు. అనారోగ్య కారణాలతో గని ఆవరణలో చనిపోయిన గని ప్రమాదంగా గుర్తించడం లేదని కార్మికుడు చనిపోయినప్పుడే నానా రాద్దాంతం చేయడం మినహా వారి కుటుంబాన్ని అటు యాజమాన్యం గాని ఇటు కార్మిక సంఘాలు గాని పట్టించుకోవడంలేదని దీని కొరకు ఒక దీర్ఘకాలిక ఆలోచనతో సరైన ఒప్పందం చేసుకోవాలని అవసరమైతే అన్ని సంఘాలతో కలిసి చనిపోయిన కార్మిక కుటుంబాలకు న్యాయం చేసేలా ఒక కమిటీ వేయాలన్నారు.

గతంలో ఎప్పుడో చేసుకున్న ఒప్పందాల పరంగా గని ఆవరణలో మరియు గనిలో మస్టర్ పడినాక మరియు గని లోపల కూడా ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో చనిపోయిన కూడా గని ప్రమాదంగానే గుర్తించి అతని కుటుంబానికి తగిన ఆర్థిక సాయం చేసేలా సి అండ్ ఎండి దగ్గర జరిగే స్ట్రక్చరల్ సమావేశంలో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. గణిత అందుబాటులో అంబులెన్స్ ఉంచకపోవడంపై తగిన విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని క్రింది స్థాయిలో కాకుండా పై స్థాయి అధికారులను సైతం శిక్షించినప్పుడే మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరి రావు, బ్రాంచి అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, పిట్ కార్యదర్శి అనబోయిన శంకరయ్య, పెండం సమ్మయ్య, బొంకూరి సురేష్, సానబోయిన సాయి ప్రకాష్, కుమార్, సభ్యులు కార్మికులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App