బాపట్ల పట్టణం,రూరల్,సబ్ డివిజన్ పరిధిలో బార్ షాపుల యజమానులు రాత్రి 11 లోపు షాపులు మూసివేయాలని ..
ప్రజలు ఎవరు కూడా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరం.
మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తాం.
అర్ధరాత్రి సమయాలలో యువకులు విచ్చలవిడిగా తిరిగితే సహించేది లేదు.
అత్యవసర పరిస్థితుల్లోనే ఎవరైనా బయటకు రావాలి.వచ్చే సమయంలో గుర్తింపు కార్డు వెంట ఉండాలి.పనులు చూసుకుని వెంటనే నివాసాలకు వెళ్లిపోవాలి.
సబ్ డివిజన్ పరిధిలోని పట్టణాలలో,రూరల్ ప్రాంతాలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగి సంచరిస్తే పోలీసులకు ప్రజలు సమాచారం అందించి సహకరించాలి.
ఎవరు కూడా వివాదాలలో తలదుర్చకుండ ప్రశాంతమైన జీవితం గడపాలి..వివాదాలలో తల దూర్చి శాంతి భద్రతకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
రాత్రుల సమయాలలో ఎవరైనా రహదారులలో తిరిగిన,షాపులు తెరిచి ఉంచిన చర్యలు తీసుకోవాలని బాపట్ల పట్టణ సీఐ శ్రీనివాసులు,రూరల్ సిఐ శ్రీహరి,రూరల్ సర్కిల్ సీఐ హజరత్ బాబు,సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్న బాపట్ల డిఎస్పీ వెంకటేశులు.. .