ఐఎఎస్ Vs ఐపీఎస్….నువ్వా..నేనా అంటూ ..ఒకరిపై ఒకరు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టుకున్న వైనం…కోర్టుకు వెళ్లిన పంచాయితీ…సర్దుకుపోతే బాగుంటుంది..’అంటూ ఇద్దరికి సుప్రీం కోర్టు సూచన..అసలు ఎవరు వారు? దేనికి ఇలా..?..
Trinethram News : అసలేం జరిగింది…
కన్నడనాట ఇద్దరు మహిళా సివిల్ సర్వీస్ అధికారులు మధ్య అప్పట్లో మాటల యుద్దం నడిచింది.
ఐఏఎస్ రోహిణి సింధూరికి వ్యతిరేకంగా ఐపీఎస్ డి. రూపా ముద్గిల్ ఫేస్బుక్లో తీవ్ర విమర్శలతో పలు పోస్ట్‌లు చేశారు.
రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు.
రోహిణిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సోషల్ మీడియా వేదికగా ఇద్దరు ఉన్నతాధికారులు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఇష్యూ హాట్‌టాపిక్ అయ్యింది.
ఐపీఎస్ రూపా ముద్గల్ తన పోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఐఏఏస్ రోహిణి సింధూరి మండిపడ్డారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానన్నారు. ఫొటోలను బయటపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రూపా తనపై దుష్పప్రచారం సాగిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. రూపా ముద్గల్ మతి స్థిమితం కోల్పోయిందని రోహిణి మండిపడ్డారు. రూపా ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తపనతో ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఆమె మానసిక రోగానికి చికిత్స తీసుకోవాలని సెటైర్ వేశారు రోహిణి. దీంతో పాటు కోర్టును ఆశ్రయించారు.
ఇద్దరూ ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు. మున్ముందు ప్రభావంతమైన భవిష్యత్ ఉంది. సామరస్యపూర్వంగా సమస్యను పరిష్కరించుకోండి. మొండితనంతో దేన్నీ సాధించలేం. పరిస్థితిని అర్థం చేసుకుని మీ వివాదానికి నెలలో ముగింపు పలకండి” అని IAS రోహిణి సింధూరి, IPS డి. రూపలకు సూచించింది సర్వోన్నత న్యాయస్థానం. ఉన్నత స్థానంలో ఉండి.. ఇలా గొడవలు పడి.. ఒకరినొకరు కించపరుచుకుంటూ.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని న్యాయమూర్తి ఇరువురిని ప్రశ్నించారు. ఇలా బహిరంగ ఆరోపణల వల్ల ఎలా ఉపయోగం ఉండదన్నారు. అయితే రోహిణి సింధూరి మాత్రం పట్ట వీడలేదు. సోషల్ మీడియాలో తనను కించపరుస్తూ పెట్టిన పోస్టులు తొలగిస్తే సరిపోదన్నారు. తనను ఇబ్బంది పెట్టిందనందుకు సారీ చెప్పాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో కేసు విచారణను మార్చి 15కు వాయిదా వేశారు న్యాయమూర్తి జస్టిస్ ఓకా.