
తేదీ : 19/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, ఏ కొండూరు మండలం, అట్ల ప్రగడ గ్రామం లో ఉన్నటువంటి వైసిపి నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు నారెడ్ల. వీరారెడ్డి మాట్లాడడం జరిగింది.
ఆయన చదువుకునే రోజుల్లో విద్యార్థులకు యూనియన్ లీడర్ గా ఉన్నాడు. అదేవిధంగా 1983 వ సంవత్సరంలో ఖoభం పాడు సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి అయిన వెంటనడిసి కడప, కర్నూల్ జిల్లాల్లో పర్యటన సందర్భంలో పాల్గొనడం జరిగింది. భారతదేశంలోనే ఆరోగ్య శ్రీ పథకం నిరుపేదలకు ఉపయోగపడుతుందని ఆయన పథకం పెట్టడం జరిగింది. ఆ పథకాన్ని గౌరవించి కొంతమంది దేశ రాజకీయ నాయకులు అలాంటి వ్యక్తులు ఒక పదిమంది ఉన్నట్లయితే దేశాన్ని అభివృద్ధి పరిచేలా కార్యక్రమాల ను నిర్వహిస్తారని అన్నారు అని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగిందని ఆ సభలో రాష్ట్ర కమిటీ సభ్యులుగా నేను ఉన్నానని చెప్పారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నాకు తెలిసిన వెంటనే ఆ సమస్యకు పరిష్కారం నేను చేసేది అయితే వెంటనే చేశాను, చేస్తున్నాను , చేస్తాను అని, ఒకవేళ నేను కాకుండా ఎవరైతే పరిష్కారం చేస్తే అవుతుందో వాళ్లతో చేపించాను, చేపిస్తున్నాను, చేపిస్తాను అని అనడం జరిగింది.
ప్రజా సమస్యలే నా సమస్యలు అనుకుని నేనెప్పుడు ప్రజల పక్షాన ఉంటున్నాను అని తెలిపారు. గత ప్రభుత్వం వైసిపి హాయంలో నవరత్న పథకాలు ప్రతి నిరుపేదలకు అందాయని పేర్కొన్నారు. నేను పార్టీలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్ప సంపాదించుకోవడానికి కాదని స్పష్టంగా వివరించారు. గెలుపు ఓటమీలు రాజకీయంలో సహజమే కానీ ఒకరిని ఒకరు కించపరుచుకోవడమే తప్పు అని వ్యాఖ్యానించడం జరిగింది.
మళ్లీ 2029వ సంవత్సరంలో వైసిపి అధికారంలోకి తప్పకుండా వస్తుందని ఆయన వివరించడం జరిగింది. 2022వ సంవత్సరంలో కృష్ణాజిల్లాకు జడ్పిటిసి గా ఎన్నికై ప్రజలకు ఎంతో మేలు చేశానని గుర్తుకు తెచ్చుకున్నారు. పార్టీ గెలిచిన గెలవకపోయినా, ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలకు పరిష్కారమై ఉండటమే నా లక్ష్యం అని కొనియాడారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
