TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్: రాయితీ పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. మొత్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లకు గాను ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,52,47,864 (42.38 శాతం) చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ. 135 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.34 కోట్లు, సైబరాబాద్‌ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ పరిధిలో రూ.16 కోట్లు ఆదాయం వచ్చింది. రాయితీపై చెల్లించేందుకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో త్వరగా చెల్లించాలని పోలీసులు సూచించారు. గడువును మరోసారి పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. గతేడాది డిసెంబర్ 27నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు 15 రోజులు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. సాంకేతిక సమస్యల కారణంగా జనవరి 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే