హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు..
రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నారు.. అను ఇంజనీరింగ్ కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీ-ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అశోక్ కుమార్ తో పాటు మరో మైనర్ అరెస్టు చేశారు. స్టూడెంటైన అశోక్ కుమార్, డ్రగ్స్ కు బానిసగా మారాడు.. ఆ తరువాత డ్రగ్స్ సేవిస్తూనే సరఫరాదారుడిగా మారాడు అని పోలీసులు పేర్కొన్నారు. అశోక్ కుమార్ తో పాటు అరెస్టైన మైనర్ కూడా డ్రగ్స్ పెడ్లర్ గా గుర్తించారు. వీరిద్దరూ రాజస్థాన్ ప్రాంతానికి చెందిన వారు అని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు..