కిడ్నీ పాడైందని ఎలా గుర్తించాలి? ప్రొటీన్యూరియా అంటే ఏమిటి?
”మూత్రం రూపంలో కొద్దిమొత్తంలో ప్రొటీన్ బయటికి పోతుంది. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఇది జరుగుతుంది. అయితే, ఈ ప్రొటీన్లు పెద్దమొత్తంలో మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతే అది శరీరానికి ప్రమాదకరంగా మారుతుంది. ఈ లీకేజీని ప్రొటీన్యూరియా అంటారు” అని డాక్టర్ సిద్ధార్థ్ చెప్పారు.
ఈ ప్రొటీన్యూరియా పరిస్థితి ఏర్పడడానికి డయాబెటిస్ ప్రధాన కారణం. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే పెద్దమొత్తంలో ప్రొటీన్ మూత్రం రూపంలో బయటికి వెళ్లిపోతుంది. ఈ ప్రొటీన్యూరియా, డయాబెటిస్ నియంత్రణలో లేకపోవడాన్ని సూచించే ప్రధాన లక్షణం.
ఇంకా హైబీపీ, కొన్ని కిడ్నీ సంబంధిత వ్యాధులు ప్రొటీన్యూరియాకి కారణమవుతాయి.
ప్రొటీన్యూరియా లక్షణాల గురించి తెలియజేస్తూ, ”మూత్రం నురుగుతో రావడం ప్రొటీన్యూరియాని తెలియజేస్తుంది” అని డాక్టర్ సిద్ధార్థ్ చెప్పారు.
తరువాతి దశలో రోగుల చేతులు, కాళ్లలో వాపు కనిపిస్తుంది. అలాగే నీరసం, కడుపు నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్ కూడా రావొచ్చు.