సర్పంచుల సంగం నాయకుల హౌస్ అరెస్ట్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దోమ.. సర్పంచుల పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం సీఎం మంత్రుల నివాసాల ముట్టడికి తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఐకాస పిలుపు ఇవ్వడం తో మంగళవారం ఉదయం పోలీసులు సర్పంచుల సంగం నాయకులు కె రాజిరెడ్డి నీ దోమ మండల కేంద్ర లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు మీ సంగం పిలుపు తో సర్పంచ్ లతో హైదరాబాద్ వెళ్ళవద్దు అని ఏఎస్ఐ చారి హెడ్ కానిస్టేబుల్ నర్సింలు రాజిరెడ్డి నీ కోరారు
**బిల్లులు చెల్లించి సీఎం మాట నిలబెట్టుకోవాలి.కె రాజిరెడ్డి
ప్రతిపక్ష హోదాలో సర్పంచుల పెండింగ్ బిల్లులపై ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి అని సర్పంచుల సంగం నాయకులు కె రాజిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేసారు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు ఏడు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని శాసన సభ సాక్షిగా సంబంధిత మంత్రి పేర్కొన్నారని ఏడాది గడిచిన రూపాయి బిళ్ళ కూడా సర్పంచులకి చెల్లించలేదని వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి చాలా మంది సర్పంచులు అప్పుల పాలు అయ్యారు పది వేల మందికి పైగా సర్పంచులకు రావాల్సిన బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలి అని సర్పంచ్ల సంగం నాయకులు కె రాజిరెడ్డిప్రభుత్వాన్ని కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App