TRINETHRAM NEWS

అరకులోయ లొ కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం.

అల్లూరి జిల్లా, అరకువేలి. మండలం త్రినేత్రంన్యూస్.13

అరకు లోయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తుల బృందం రాకతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆంద్ర ప్రదేశ్ కాంగ్రెసు యువ నాయకుడు. పాచిపెంట చిన్నాస్వామి నీ అరకు లోయ పోలీసులు,గృహ నిర్భంధం చేశారు.ఈ సందర్భంగా పాచిపెంట చిన్నస్వామి మిడియాతో,మాట్లాడుతూ అరకు. చింతపల్లి .పాడేరు. న్యాయస్థానాలకు శాశ్వత న్యాయమూర్తులు లేరు.జీ ఓ నెంబర్ 3 ను చట్టబద్ధత కల్పించాలి,గిరిజన యువతకు ఉద్యోగ భద్రత చట్టం తీసుకురావాలి. గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్లు లేకపోవడం వలన విద్యార్థుల, విద్యార్థులు వందలాదిమంది మరణించినారు. సుమారు 1200 మంది హెల్త్ వాలంటీర్లు రెన్యువల్ చేయాలి .
గిరిజనులు గిరిజన సమస్యల కోసం దేశ రాజధాని ఢిల్లీలో వెళ్లి మన హక్కులు.కోసం చట్టాల కోసం వినతి పత్రం ఇవ్వలేము అత్యున్నత న్యాయస్థానం చీప్ జస్టిస్ గారు న్యాయమూర్తి న్యాయమూర్తులు బృందం వచ్చినప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, మరియు పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, గిరిజన సమస్యల పైన హక్కుల పైన చట్టాల పైన న్యాయ నిపుణులు ఉన్నత అధికారులు సంప్రదింపులు, లేకుండా గిరిజన సంఘాలు రాజకీయ నాయకులు వినతి పత్రం సమర్పించే చర్య తీసుకొకపోవడం చాలా విచారకరం ,అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు 25 మంది జడ్జిలు .
అరకు పర్యటన సందర్భంగా గిరిజన హక్కులు చట్టాల పైన సమీక్షించాలని గిరిజనులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ప్రకటన ఇచ్చినందుకు గౌరవ చీఫ్ జస్టిస్, కి వినతిపత్రం ఇవ్వకుండా ముందస్తుగా ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వర రావు, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి ,అరకు వేల్లి కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి భగత్,కు ముందస్తుగా హౌస్ అరెస్టు చేసినారు ఇది ప్రజాస్వామ్య హక్కు కు, భంగం కలిగించడం అని విచారం వ్యక్తం చేసినారు.
పై గిరిజన సమస్యల పైన కూటమి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ లగిరిజన కూటమి నాయకులు స్పందించకపోవడం చాలా దురదృష్టకరము

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App