TRINETHRAM NEWS

Honorable people who worked for the upliftment of Dalits. Jagjeevan Ram

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

దళితుల అభ్యున్నతి కోసం బాబు జగ్జీవన్ రామ్ ఎంతగానో కృషి చేసారని, సమసమాజ స్దాపనకై కృషి చేసిన కృషివలుడు
మహనీయులు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. శనివారం బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని గోదావరిఖని పట్టణంలోని పోలీస్ స్టేషన్ మూలమలుపు వద్ద గల జగ్జీవన్ రాం విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ గారు పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని దళితుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. 1936 నుండి 80 వరకు గొప్ప పార్లమెంటీయర్ గాదేశానికి సేవలు చేసిన గొప్ప రాజకీయ నాయకులు జగ్జీవన్రామ్ అన్నారు. 40 ఏళ్ళ పాటు ప్రజలకు సేవ చేసి క్రమశిక్షణ కలిగిన మహనీయులు అన్నారు రాజ్యాంగ నిర్మాణంలో సభ్యుడిగా, అంబేద్కర్ రాజ్యాంగం అమలులో జగ్జీవన్ రామ్ గారు ఎంతగానో కృషి చేశారని అన్నారు.

అంటరానితనం నిర్మూలన కోసం, దేశంలోని దళిత బహుజనులను సంపన్నులుగా మార్చలన్నా లక్ష్యంతో
వారు పని చేశారని చెప్పారు. మహనీయులు దేశానికి చేసిన సేవాలు, త్యాగాలు భావితరాలకు అందించాలని వారిని స్మరిస్తూ జయంతి లను వర్ధంతి లను జరుపుకుంటని కాగా రామగుండం నియోజకవర్గంలో మహనీయుల జయంతి వర్ధంతి లను నిర్వహణ పట్ల పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహించడంసరైందికాదని, మార్పు తీసుకువస్తామని అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహనీయుల జయంతులను పట్ల వర్దంతులను నిర్లక్ష్యం చేయడమేనా మార్పా అని ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.
దళిత సంఘాలు ప్రజలందరు ఈ చర్యల పట్ల అగ్రహం వ్యక్తం చేస్తున్నారని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ స్దానిక ఎమ్మెల్యే సమాదానం చేప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోడేటి శంకర్ గౌడ్ అచ్చే వేణ మేతుకు దేవరాజ్ నూతి తిరుపతి పిల్లి రమేష్ నారాయణదాసు మారుతి నీరటి శ్రీనివాస్ చెలకలపల్లి శ్రీనివాస్ చల్లగురుగుల మెగిళి ఇరుగురాళ్ల శ్రావన్ సాయి కుమార్ కిరణ్ జీ పట్ల మధు దళిత సంఘాల నాయకులు బోంకూరి మధు మైస రాజేష్ కొంకటి లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Honorable people who worked for the upliftment of Dalits. Jagjeevan Ram