
డిండి( గుండ్ల పల్లి) మార్చి 14 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రం నందు రాజ కీయనాయకులు, ఉద్యోగస్తులు మరియు యువకులు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు చిన్నారులు మహిళలు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజు మాట్లాడుతూ హోలీ సామాజిక ఐక్యత ఆనందం సంప్రదాయాలను వ్యక్తపరిచే పండుగ గా నిలిస్తుందని, కులమత, చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా చేసుకునే గొప్ప పండుగని, ఈ పండుగ వసంతా రుతుకీ ఆహ్వానంపలుకుతుందని, ప్రకృతి వి కొత్త చెప్పులతో పచ్చదనంతో వెళ్లి కలగా కనిపిస్తుందని, పూర్వం హిరణ్య కశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు అతడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని విష్ణువుని పూజించకుండా అడ్డుకోవాలని చూశాడు, చెల్లెలు కూలికకు అగ్ని కూడా ఏమీ చేయలేని వరం ఉంది.
దాంతో హిరణ్య కశిపుడు హోలి కను ప్రహ్లా దుడిని ఒడిలో పెట్టుకొని మంటల్లో కూర్చోమని చెప్పాడు కానీ విధి వక్రీకరించింది. హోలిక మంటల్లో కాలిపోయింది, ప్రహ్లాదుడిని విష్ణువు కాపాడాడు. ఈ సంఘటన చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా హోలీ పండుగ జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అని అన్నారు. అనంతరం అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసినారు.
ఈ వేడుకలో ఏటి కృష్ణ, పోల వెంకటేష్, బికుమాండ్ల మధు, కోట్ర మధు, జహంగీర్, సోహెల్, గడ్డమీద సాయి, బోల్లె శైలేష్, గుర్రం సురేష్, రాములు, శ్రీను, లక్ష్మారెడ్డి, జైపాల్ రెడ్డి, పురుషోత్తం, పొలం లక్ష్మణ్, జయ వర్ధన్, గోవర్ధన్, హుస్సేన్, నరేష్, మల్లేష్, రవి, కృష్ణ, లక్ష్మీపతి, సింకారు అజ్జు, సైదా, అంజి, వెంకటేష్l, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
