TRINETHRAM NEWS

ఇక్రిశాట్ నూతన డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాఠక్

Trinethram News : హైదరాబాద్

ఇక్రీశాట్ నూతన డైరెక్టర్ జనరల్ గా డాక్టర్ హిమాన్షు పాఠక్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయ పరిశోధన, విద్యాశాఖ (DARE) కార్యదర్శిగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR ) డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్నారు.

ఇక్రిశాట్ ఆవిర్భావం తరువాత డీజీ గా నియమితులైన తొలి భారతీయుడిగా హిమాన్షు పాఠక్ చరిత్ర సృష్టించారు. దేశంలోని పలు ICAR సంస్థల్లో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App