Helpline numbers for female students are being made aware
జిల్లామహిళా సాదికారిత కేంద్రం పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా లోని రాఘవపూర్ జెడ్. పి .హెచ్ .ఎస్, పాఠశాల నందు
పెద్దపల్లి జిల్లా మహిళా సాదికరిత కేంద్రం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది
ఈ కార్యకారమం లో జిల్లా మహిళా సాదికరిత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్, చెంద్రు స్వప్న, ఫైనాన్స్ లిటరసీ సేరు సంధ్యారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పటు చేసిన సంకల్ప్ 100 రోజుల కార్యక్రమం లో బాగంగా ఆడపిల్లల సంఖ్య రోజు రోజు కు తగ్గిపోతుందని, ఆడపిల్లల రేటును పెంచడం, మరియు శిశు మరణాల రేటును తగ్గించడమే బేటీ బచావో బేటీ పడవో ముఖ్య ఉద్దేశమని తెలిపారు
పిల్లల బధ్రత కొరకై పని చేసే హెల్ప్‌లైన్ నంబర్లు మరియు పోక్సో చట్టము,లింగ నిషేద చట్టము,బాల్య వివాహ నిషేద చట్టము,లింగ వివక్షత,ఋతుక్రమము,వ్యక్తిగత పరిశుభ్రత,క్లోత్ ప్యాడ్,వినియోగం,ఉపయోగాలు,మరియు సైబర్ నేరాల గురించి వివరించారు.
ఈకార్య క్రమం లో హెడ్మాస్టార్: బి. హనుమంతు మరియు ఉపాధ్యాయ భృందం,పిల్లలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App