రామగుండం నియోజకవర్గం నుంచి హలో మాల చలో
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్ మాల సింహగర్జన సభకు విచ్చేసిన ప్రతి మాల కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసిన మాల ఎంప్లాయిస్ పెద్దపల్లి అసోసియేషన్ టీం సభ్యులు డానియల్ మిత్ర బృందం ,మరియు మాల మహానాడుపట్టణ అధ్యక్షుడు మాలెం మధు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాలెం మధు మాట్లాడుతూ ఏ బి సి డి ఎస్ సి వర్గీకరణకు వ్యతిరేకంగా సభకు లక్షలాదిమంది స్వచ్ఛందంగా వచ్చి వారి మద్దతును తెలియజేయడం జరిగింది అని అన్నారు.
భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆగస్టు ఒకటో తారీఖున వెలువడిన తీర్పుకు వ్యతిరేకంగా ఇంత మంది మాల జాతి సభ్యులు పాల్గొనడం బిజెపి తొందరపాటు నిర్ణయాలకు ఇది చెంపపెట్టు అని మాలెం మధు అన్నారు.
ఈ కార్యక్రమంలోడేనియల్,దొంత శ్రీనివాస్,గడ్డం శేఖర్,కారం వినయ్,పులి మహేష్,భీమ్సేన్,బొమ్మక వెంకటేశ్వర్లు,కొండ కుమార్,నరేష్,తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App