TRINETHRAM NEWS

Helicopter accident in Maharashtra

పుణెలోని బవ్‌ధాన్‌లో కూలిన హెలికాప్టర్

ప్రమాదంలో ముగ్గురు మృతి

Trinethram News : పూణే

మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం జరిగింది.పూణెలో బుధవారం తెల్లవారుజామున హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. పూణె జిల్లాలోని బవధాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగడంతో హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలిపారు ఈ విషాద సంఘటన జరిగిన వెంటనే రెండు అంబులెన్స్ లు నాలుగు ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్, ఇద్దరు ఇంజినీర్లు మృతి చెందినట్లు తెలిపారు. అయితే, ఇంకా హెలికాప్టర్ లో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పింప్రి చించ్వాడ్ పోలీసులు విచారణ చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App