TRINETHRAM NEWS

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి.

వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది.

లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి.

ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.