TRINETHRAM NEWS

పెనుమూరు సిహెచ్ సి నందు గుండె రక్షణ ప్రోగ్రాం
చిత్తూరు జిల్లా పెనుమూరు త్రినేత్రం న్యూస్. ఈరోజు పెనుమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం నందు హృదయ రక్ష (STEMI awirness program ) ప్రోగ్రాం పై అవగాహన సదస్సును మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎవరైనా గుండె జబ్బుతో ఆసుపత్రికి వస్తే వారికి వెంటనే ఈసీజీ తీసి గుండెనొప్పి ఉందని నిర్ధారణ అయితే వెంటనే ఒక గంట వరకు రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి టెనిక్ ప్లస్ అనే ఇంజక్షన్ ఇస్తారు ఇది సుమారు 45000 ఉంటుంది.దీనిని సిహెచ్ సి నందు పూర్తిగా ఉచితంగా వేస్తారు.

దీనివల్ల రోగి ఒక గంట లోపు గుండె సంబంధిత డాక్టర్ వద్దకు చేరేవరకు ప్రాణాపాయం నుండి కాపాడవచ్చు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను గుండె జబ్బుల నుండి ప్రాణాలు కాపా డేందుకు ప్రవేశపెట్టిన ఈ సదావ కాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ సంధ్య, హెడ్ నర్సు నిర్మలాదేవి, సీనియర్ ఫార్మసి ఆఫీసర్ సయ్యద్ ఇర్షాద్ మరియు సిహెచ్సి స్టాప్ మేంబర్స్ ప్రజలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heart protection