TRINETHRAM NEWS

అమరావతి.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పై నేడు విచారణ.

స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ.

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలను ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన స్పీకర్ కార్యాలయం.

తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ..

స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ ఆదేశాలు. ..

వివరణ ఇచ్చేందుకు ఒక్కొక్క ఎమ్మెల్యేకు 15 నిమిషాల వరకు సమయం కేటాయింపు.

వివరణ ఇవ్వడానికి 30 రోజులు గడువు కావాలని స్పీకర్ కి లేఖ రాసిన వైసీపీ రెబెల్స్

వైసీపీ నుంచి నలుగురు ఎమ్మేల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం రామ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టిడిపిలో చేరిక.

టిడిపి నుంచి గెలిచిన ఎమ్మేల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్ వైసీపీ చేరిక.