చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా
Trinethram News : ఢిల్లీ : స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టు లో విచారణ వాయిదా పడింది..
ఈ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టు తీర్పును గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వర్చువల్‌గా వాదనలు వినిపించారు. బెయిల్ రద్దును సవాలు చేస్తూ తాము దాఖలు చేసిన పిటీషన్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. తాను ఢిల్లీలో లేనని, విచారణకు స్వయంగా హాజరు..కావాలనుకుంటున్నందువల్ల జనవరి వరకు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో జనవరి రెండో వారానికి కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ బేలా ఎం త్రివేదీ ధర్మాసనం వెల్లడించింది….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App