TRINETHRAM NEWS

కొన్ని గంటలుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లోనే హరీశ్ రావు

కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చిన హరీశ్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన

సీనియర్ నేతల అరెస్టును ఖండించిన కవిత

Trinethram News : Hyderabad : మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు మూడు గంటలకు పైగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారు. దాంతో, హరీశ్ రావును అరెస్ట్ చేశారని భావిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు తరలి వచ్చారు. హరీశ్ రావును తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి… జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

సీఐని అడ్డగించి, బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హరీశ్ రావు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో పోలీసులు హరీశ్ రావును అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హరీశ్ రావును జీపు ఎక్కిస్తున్న సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. హరీశ్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు.

గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్‌లో హ‌రీశ్ రావుతో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App