ఢిల్లీలో హరీష్ రావు – న్యాయనిపుణులతో చర్చలు
Trinethram News : బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు న్యాయనిపుణులతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు. ఓ వైపు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన సమయంలో హరీష్ ఢిల్లీలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. అయితే ఈడీ కేసులు.. ఇతర వ్యవహారాలప మాట్లాడటానికి రాలేదు.. ఫిరాయించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వచ్చామని హరీష్ రావు సన్నిహితులు చెబుతున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా.. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని కోర్టుకు బీఆర్ఎస్ తెలిపింది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో బీఆర్ఎస్ పేర్కొంది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోర్టును బీఆర్ఎస్ కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో తీర్పు వచ్చిందని .. ఆ తీర్పునకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని బీఆర్ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది.
అయితే ఈ పిటిషన్ దాఖలు చేయడానికి హరీష్ రావు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లాల్సిన పనిలేదు.పిటిషన్లు దాఖలు చేయడానికి ప్రత్యక్షంగా ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీ వెళ్లడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని తెలంగాణ రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అవేమిటన్నది బీఆర్ఎస్ ముఖ్యులకు మాత్రమే తెలిసే అవకాశం ఉంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App