అరకువేలి మండల ప్రజలందరికి పోలిసు వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అరకు లోయ/త్రినేత్రం న్యూస్, స్టాఫ్ రిపోర్టర్: డిసెంబరు 31
డిసెంబర్ 31 న నిర్వహించుకునే వేడుకలు కు మండల ప్రజలు, పర్యాటకులు , అందరు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, జరుపుకోవాలని మరియు అందరు పోలీస్ వారికీ సహకరించాలని అరకు వ్యాలీ, పోలీస్ వారు తెలియజేయడం జరిగింది .
డిసెంబర్ 31 వేడుకలు నిర్వహించుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉంటూ పోలీసు వారి సూచనలు పాటించాలి, వేడుకలు నిర్వహించుకునే వారు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రమాదాలకు దూరంగా ఉంటూ నిర్వహించుకోవాలని అన్నారు. డిసెంబరు 31వ తేది రాత్రి 7 గం. నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాము.మద్యం సేవించి వాహనాలు నడిపితే అలాంటి వారిని అదుపులొకి తీసుకుని కేసులు నమోదు చేసి కోర్టు లో హాజరు పరుస్తాము, అదేవిదంగా వాహనము సీజ్ చేయడం లైసెన్స్ రద్దు చేయడం మరియు బైయిండోవర్ లాంటి చట్ట పరమైన చర్యలు తీసుకోబడును. గంజాయి, డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాలు సేవించే వారి పై ఎప్పటికప్పుడు డ్రగ్స్ టెస్టింగ్ కిట్ల ద్వారా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.
ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండ వాహనం నడిపితే కూడా చట్ట పరమైన చర్యలు తప్పవు.
మఫ్టీ టీమ్స్ తో అక్రమ సిట్టింగులు, ఆరుబయట మద్యం సేవించడం, గుంపులు గుంపులుగా తిరుగుతూ మహిళలను వేదింపులకు గురి చేస్తూ,ఇబ్బందులను పెట్టే వారిపై ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది.ఆర్కెస్ట్రా, డి.జే లు, మైకులు ఉపయోగించడం, బాణసంచా నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు.ముఖ్యంగా యువత పై కేసు నమోదు ఐతే భవిషత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు,ఇతర దేశాలకు వెళ్ళుటకు వీసాలు లాంటివి ఇవ్వబడవు, కావున యువత గమనించగలరు. మద్యానికి దూరంగా ఉండాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి.
వేడుకల్లో అపశృతులు జరగకుండా వాహన తనిఖీలు, పెట్రోలింగ్, పికేట్స్, మఫ్టీ టీమ్స్, లాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము.
పై సూచనలు పాటిస్తూ ప్రజలు మరియు యువత యొక్క అమూల్యమైన జీవితం ప్రమాదాల బారిన పడకుండా చూడడం పోలీస్ వారి బాధ్యత.
ప్రజలు పోలీసు వారి సూచనలు పాటిస్తూ ఇన్సిడెంట్ ఫ్రీ, ఆక్సిడెంట్ ఫ్రీ, గా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
మి క్షేమమే మా ధ్యేయం
అరకువేలి, పోలీస్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App