తేదీ : 09/01/2025.
ఘనంగా పుట్టినరోజు వేడుకలు.
జీలుగుమిల్లి : (త్రినేత్రం న్యూస్) ; విలేఖరి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం , జీలుగుమిల్లి మండలం , బరింకలపాడు గ్రామంలో పోలవరం శాసనసభ్యులు పుట్టినరోజు వేడుకలు తేదీ : 08/01/2025 న అనగా బుధవారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ప్రజలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా యువకులకు వాలీబాల్ , క్రికెట్, షటిల్, విలువిద్య వంటి ఆటల పోటీలు పెట్టి గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రజలందరకు అడ్వాన్సుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. చిర్రి చారిటబుల్ ట్రస్ట్ ను నిర్మించడం జరిగింది .
ఈ ట్రస్టు ద్వారా నిరుపేదలకు, మరియు వృద్ధులకు , వికలాంగులకు, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సదుపాయాలు కల్పించడం. జరుగుతుంది అన్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిండు నూరేళ్లు చల్లగా సంతోషంగా జరుపుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని ప్రజలు మరియు ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అనడం జరిగింది.
సమస్య ఎక్కడుంటే అక్కడే పరిష్కారం అయ్యే దిశగా అడుగులు ముందుకు వేసే నాయకుడని కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ , జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం. మునుగు రవికుమార్, నాయకులు కరాటం రాంబాబు, ఉమ్మడి కూటమి నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కేక్ కట్ చేసి , స్వీట్స్ పంచి పెట్టినారు. ప్రతి ఒక్కరికి ఇందు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రులు మరియు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారని చెప్పడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App