TRINETHRAM NEWS

Trinethram News : యూపీ రాజధాని లక్నోకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఫీనిక్స్ ప్లాసియో సమీపంలో ఓ అమ్మాయి రోడ్డుపై నడుస్తున్న కారుకు డ్రైవర్ సీటు దగ్గర వేలాడుతూ కనిపించింది. కారు నడుపుతున్న వ్యక్తి ఆమెను ఒక చేత్తో పట్టుకున్నాడు. కారు నడుపుతున్న వ్యక్తితో అమ్మాయి కబుర్లు చెబుతోందని మాత్రం అర్థమవుతుంది. ఈ జంటకు యూపీ పోలీసులు గట్టి గుణపాఠం చెప్పాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.