TRINETHRAM NEWS

Group-1 Preliminary Exam conducted peacefully

పెద్దపల్లి, జూన్ -09 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
ఆదివారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ జిల్లా కేంద్రంలో గ్రూప్ -1 పరీక్ష నిర్వహిస్తున్న పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ట్రినిటీ, మథర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలను, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ మధర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, పెద్ద కల్వలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరీక్షా సెంటర్ లో హాజరైన అభ్యర్థుల బయో మెట్రిక్ హాజరు వివరాలను అడిగి తెలుసుకొని, అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షా రాసే విధంగా, సమయం తెలిసే విధంగా ప్రతి అరగంట సమయానికి బెల్, చివరి 30 నిమిషాలు ఉన్నప్పుడు అలారం బెల్ మోగే విధంగా చూడాలని తెలిపారు
జిల్లాలో మొత్తం 14 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షకు మొత్తం 6098 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 4737 మంది విద్యార్థులు హాజరు కాగా, 78 శాతం హాజరు నమోదు అయినట్లు, మిగిలిన 1361 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు
పరీక్ష ముగిసిన పరీక్ష అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ పర్యవేక్షణలో హైదరాబాదు నుండి వచ్చిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులకు సంబంధిత పరీక్షా మెటీరియల్ ను అందించారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Group-1 Preliminary Exam conducted peacefully