TRINETHRAM NEWS

అర్హులైన ప్రతి పేదవాడికి ఇండ్లు మంజూరు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రతి పేదవాడికి ఇండ్లు మంజూరు అయ్యేలా చర్యలు చేపడుతామని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు.బుధవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విధి విధానాలపై హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి.గౌతం చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ లు, హౌసింగ్, ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్ లకు పలు సూచనలు సలహాలు చేశారు.హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి.గౌతం వికారాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పారదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.

ప్రజా పాలనలో భాగంగా 2,57,664 ఇండ్ల కొరకు దరఖాస్తులు వచ్చాయని, 2,46,479 దరాఖాస్తులను పరిశీలనాకై చర్యలు తీసుకోవడం జరిగిందని, సర్వే పనులు పూర్తి దశకు చేరుకున్నాయని తెలిపారు. ఇండ్ల నిర్మాణాలకు మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. దరఖాస్తుల పరిశీలనలో ఏమైనా తప్పులు దొర్లినట్లయితే తిరిగి పరిశీలిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు కలెక్టరేట్ నుండి అదనపు కలెక్టర్ సుధీర్, హౌసింగ్ పిడి ఎ.కృష్ణయ్య, డిఇ , ఏఇ లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grant of houses