![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-21.07.20.jpeg)
అనపర్తి నియోజకవర్గంలో 3 ఆలయాలకు నిధుల మంజూరు
త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా. అనపర్తి నియోజకవర్గంలోని రామవరం, రంగంపేట, వడిశలేరు గ్రామాలలోని ఆలయాలకు నిధుల మంజూరు గురించి ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ…
గత ఆగష్టులో అనపర్తి నియోజకవర్గంలోని ఏడు ఆలయాల పునరుద్దరణకు నిధులను మంజూరు చేయమని కోరూతూ దేవాదాయ,ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ని కలవడం అందుకు అనుగుణంగా అధికారులకు వారు ఆదేశాలను జారీ చేయడం వాటిలో 3 గ్రామాల ఆలయాలకు సర్వశ్రేయో నిధి నుండి నిధులు మంజూరు చేయడం జరిగింది
ముఖ్యంగా ఈ 3 గ్రామాల నుండి గ్రామస్ధులు సర్వశ్రేయోనిధికి కంట్రిబ్యూషన్ చెల్లించడం దానిని కమిటీకి పంపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమదటి సి జి యఫ్ సర్వశ్రేయో నిధి సమావేశంలోనే నిధులు మంజూరు చేయడం జరిగింది
రామవరం గ్రామంలో ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి ఆలయానికి రూ 1.52 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది
రంగంపేట గ్రామంలోని ఉమారామలింగేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఆలయాలకు రూ 2.22 కోట్లకు గాను తొలివిడతగా రూ 1 కోటి యాభై లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగింది
వడిశలేరు గ్రామంలో ఉన్న భజన్నారాయణస్వామి వారి ఆలయానికి రూ 60 లక్షల రూపాయిలు మంజూరు చేయడం జరిగింది
తొలి సమావేశంలోనే అనపర్తి నియోజకవర్గంలోని 3 ఆలయాలకు నిధులు మంజూరు చేసిన దేవాదాయశాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి,కి మరియు కమీషనర్,కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను
మిగిలిన నాలుగు గ్రామాలకు సంబంధించి గ్రామస్తులు కంట్రిబ్యూషన్ సొమ్ము చెల్లించిన వెంటనే ఆ ఆలయాలకు కూడా నిధులు మంజూరు చేసేందుకు అంతా సిద్దంగా ఉందని తెలియజేస్తున్నాను
రాష్ట్ర ఆర్దిక పరిస్దితి గడ్డుగా ఉన్నప్పటికీ కూడా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతిబాటలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![MLA Nallamilli](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-21.07.20-1024x576.jpeg)